మన భవిష్యత్తుపై వాళ్లకే కంట్రోలా?

మన ఫోన్‌లో ఏం కనిపించాలి దగ్గర నుంచి.. రేపటి ఉద్యోగాలు ఎలా మారాలి వరకు AI ప్రభావం పెరుగుతోంది. కానీ ఈ టెక్నాలజీ మొత్తం కొద్దిమంది కంపెనీలు లేదా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే? ఇదే విషయంలో OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు. AI ఎలా ఎదగాలి, సమాజంపై దాని ప్రభావం ఎలా ఉండాలి అనే నిర్ణయాల్లో ప్రజలకూ భాగం ఉండాలని ఆయన అన్నారు. AIపై నిర్ణయాలు కొద్దిమంది తీసుకుంటే.. దాని లాభాలు, నష్టాలు వాళ్ల నిర్ణయాలపైనే ఆధారపడొచ్చు. AI మన కోసం పనిచేయాలి.. మన భవిష్యత్తును మనకు తెలియకుండానే నిర్ణయించకూడదు.



