వరద ప్రాంతాల్లో MLA పర్యటన.. రైతులకు భరోసా!
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ నియోజకవర్గంలో ఉదయం నుంచి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నివేదికను త్వరితగతిన అందజేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. కోతకు గురైన ఉనుకూరు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని సూచించారు.



