మాసాయిపేట మండలంలో విషాదం

TG : మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో విషాదం నెలకొంది. ఎడ్ల ప్రవీణ్(32) పొలం వద్ద గ్రాస్ కట్టింగ్ చేస్తుండగా విద్యుత్తు లైను తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయినట్టు చేగుంట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఆస్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ తల్లి రెండు నెలల కిందటే మరణించింది. రెండు నెలల్లోనే తల్లి, కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.



