← Back to news

ఐదేళ్ల బాలుడి నోట్లో గుచ్చుకున్న ఇనుప రాడ్

By Vishi· 2h ago· Ndtv
ఐదేళ్ల బాలుడి నోట్లో గుచ్చుకున్న ఇనుప రాడ్

గుజరాత్‌లోని పాటాన్ జిల్లా షమీ తాలూకా వేద్ గ్రామంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఐదేళ్ల బాలుడు తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కిందపడిపోయాడు. ఆ టైంలో అక్కడున్న ఒక ఇనుప రాడ్ నేరుగా ఆ బాలుడి నోట్లో గుచ్చుకుని బయటకు వచ్చింది. బాలుడికి బాగా రక్తం పోవడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి రాడ్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

More in National