← Back to news

ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బాలురకు బ్లాంకెట్ల పంపిణీ

By Mallesh Yadav· 19 Aug 2026· Shankarampet (R), Shankarampet (R), Medak
ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బాలురకు బ్లాంకెట్ల పంపిణీ

TG: మెదక్ జిల్లా శంకరంపేటలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లోని స్టూడెంట్స్‌కు సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహిల్య ఉమెన్ ఫౌండేషన్ సహకారంతో బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎస్ఐ, సర్పంచ్, వార్డు సభ్యులు, అహిల్య ఉమెన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. పూనమ్ నోముల్వార్, సానీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. డి.శివ పాల్గొన్నారు. దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బాలురకు బ్లాంకెట్ల పంపిణీ

More in Local