జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DSP

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్త్ జోన్ DSP జీవన సూచించారు. వరద నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపులను వీలైనంత త్వరగా, వెలుతురు ఉండగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.



