← Back to news

వరద నీటిలో బ్రిడ్జి... రాకపోకలకు బ్రేక్

By SINDERI KAMESH· 7h ago· Pedabayalu, Peda Bayalu, Alluri Sitharama Raju
వరద నీటిలో బ్రిడ్జి... రాకపోకలకు బ్రేక్

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలో భారీ వర్షాలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. లండులు గ్రామం నుంచి ఇంజరి, మాదిగరువుకు వెళ్లే మార్గంలోని బ్రిడ్జి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిడ్జిపై ప్రయాణించవద్దని, వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు.

More in Local