← Back to news

ఫ్యాన్‌కు 3 లేదా 4 రెక్కలే ఎందుకు?

By Vishi· 17h ago
ఫ్యాన్‌కు 3 లేదా 4 రెక్కలే ఎందుకు?

మనం వాడే ఫ్యాన్‌కు సాధారణంగా 3 లేదా 4 రెక్కలు(Blades) మాత్రమే ఉంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? ఫ్యాన్ రెక్కలు గాలిని ముందుకు తోయడానికి తిరుగుతాయి. వాటి సంఖ్య పెరిగితే, ఫ్యాన్ బరువు పెరుగుతుంది. 3 లేదా 4 రెక్కలు ఉండటం వల్ల బరువు సమతుల్యంగా ఉంటుంది. ఫ్యాన్ రెక్కలు గాలిని కట్ చేస్తూ ముందుకు తోస్తాయి. ఒక రెక్క వెనుక వెళ్లే గాలి అల మరో రెక్కను తాకకుండా ఉండటానికి ఖాళీ ఉండాలి. ఎక్కువ రెక్కలుంటే వాటి మధ్య గాలి చిక్కుకుపోయి, గాలి ప్రవాహం దెబ్బతింటుంది.

More in Infotainment