నవాంద్గి PACS డైరెక్టర్‌గా నరసింహులు ఏకగ్రీవ ఎన్నిక

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంద్గి పీఏసీఎస్ డైరెక్టర్‌గా కొనిగేరి నరసింహులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు కే. వెంకట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భారత్ తదితరులు పాల్గొని నరసింహులును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.



