IT విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని V.S.M కళాశాల IT ల్యాబ్‌ను ద్రాక్షారామ పాఠశాల Vocational IT / ITES విద్యార్థులు సందర్శించారు. నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ క్షేత్ర సందర్శనలో విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణ, Hardware, Software, Networking, Cyber Security, Troubleshooting అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. IT రంగంలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించినట్లు ప్రధానోపాధ్యాయులు శేఖర్, ట్రైనర్ ఆర్.కె. రాజశేఖర్ తెలిపారు.



