← Back to news

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి

By dk yamjala· 2 Jun 2026· Eenadu· సిద్దిపేట
రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి

TG: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, క్షతగాత్రులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు.

More in Local