బొలెరో ఢీకొని దంపతులు మృతి

AP: పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద గురువారం తెల్లవారుజామున బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వల్లూరి రవి (58), ఆయన భార్య సావిత్రి (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిద్దెబావి కాలనీలోని కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



