వాన బీభత్సం.. ఇంటిపై కూలిన చెట్టు
చెన్నైలో భారీ వర్షాలకు T.Nagarలో ఓ చెట్టు ఇంటిపై కూలింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సిబ్బంది చెట్టును ముక్కలుగా కత్తిరించి తొలగించారు. ఉత్తర చెన్నైలో నిన్న 35.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, ఎయిర్‌పోర్టు నీటమునగడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. అండర్‌పాస్‌లలో నిలిచిన నీటిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చెట్టు కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.



