'మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి'

రాజన సిరిసిల్లా జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వాహకులు చేపట్టిన నిరవధిక సమ్మె నిన్న మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మెలో మండలంలోని అన్ని గ్రామాల నిర్వాహకులు పాల్గొన్నారని తెలియజేశారు.



