మట్టి వినాయకుడే.. ఎకో-ఫ్రెండ్లీ ! 🌱

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో స్పెషల్ డ్రైవ్ జరిగింది. జనసేన నాయకుడు వెజ్జు వెంకట సుబ్బారావు గ్రామస్థులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పూజకు కావాల్సిన ప్రత్యేక పుస్తకాలను కూడా అందజేశారు. ప్రకృతి దైవ స్వరూపమని, పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, మట్టి విగ్రహాలే బెస్ట్ అని సూచించారు. గ్రామస్థులు ఈ చర్యను హర్షించారు. మీరు కూడా ఈసారి మట్టి గణనాథుడినే పెడుతున్నారా? అయితే ఫొటో, వార్త పంపండి.



