← Back to news

విజయవాడలో ప్రహరీ గోడ కూలి.. మూడు ఇళ్లు ధ్వంసం!

By Jagadish· 5h ago
విజయవాడలో ప్రహరీ గోడ కూలి.. మూడు ఇళ్లు ధ్వంసం!

NTR జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్‌లో ఘటన జరిగింది. రామాలయం, జగ్గుపిల్ల రామారావు వీధి కొండ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పిల్ల లక్ష్మి అనే మహిళ ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. గోడ శిథిలాలు దిగువన ఉన్న ఇళ్లపై పడి ధ్వంసమయ్యాయి. ఆదివారం ఉదయం చిన్న రాళ్లు పడుతుంటే గమనించిన నివాసితులు బయటకు రావడంతో ఒక్కసారిగా గోడ కూలింది. మూడు ఇళ్లలో ఉన్న వారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో చీపుర్ల హైమ, పెరుమాళ్ల ఉష, అగురి లావణ్య, బండి రెడ్డి ఇళ్లు ధ్వంసమయ్యాయి.

More in Politics