← Back to news

వందల చేపలు మృతి.. కాలుష్యంపై ఆందోళన

By Anusha· 2h ago· Indiatimes
వందల చేపలు మృతి.. కాలుష్యంపై ఆందోళన

ఢిల్లీలోని యమునా నదిలో వందల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. బురారీ సమీపంలోని పల్లా–వజీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొన్ని చేపలు ఆక్సిజన్ అందక కొట్టుమిట్టాడినట్లు స్థానికులు తెలిపారు. నదిలో దుర్వాసన కూడా పెరిగిందని మత్స్యకారులు చెప్పారు. నీటి కాలుష్యమే దీనికి కారణమై ఉండొచ్చని పర్యావరణ సంఘాలు అనుమానిస్తున్నాయి. నీటి శాంపిల్స్ సేకరించి, పొల్యూషన్‌కు రీజన్స్‌ను గుర్తించాలని అధికారులను కోరాయి.

More in National