మహదేవునిపేటలో మొసలి కలకలం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో మొసలి కలకలం రేపింది. KLI కాలువ నుంచి ఓ మొసలి గ్రామంలోని వ్యవసాయ బావిలోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం బావి నుంచి బయటకు వచ్చి, పక్కనే ఉన్న గ్రామ చెరువులోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ గ్రామ చెరువు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు సూచిస్తున్నారు.



