← Back to news

పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్లు అందజేత

By Surender Panuganti· 2h ago· Nawabpet, Nawabpet, Mahabubnagar
పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్లు అందజేత

వర్షాకాలంలో విధులు నిర్వహించే గ్రామపంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడకుండా రెయిన్ కోట్లు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం రుద్రారం గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ కావలి రవీందర్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది కోసం వీటిని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంద శేఖర్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ మనోహర్, వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, మురగని వెంకటయ్య, సుందరి, సంతోష, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More in Local