తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు

AP: తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు వివరాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీదేవిని విచారించారు. నగదుతోపాటు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులను, సంబంధిత దస్తావేజులను, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.



