← Back to news

అరకులో ఘనంగా NSS దినోత్సవం

By B V Appalanaidu· 18h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులో ఘనంగా NSS దినోత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో NSS ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. ముఖ్య అతిథి ఆర్. హరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే సేవా దృక్పథం అలవర్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఉత్తమ 30 మంది వాలంటీర్లకు సర్టిఫికెట్లు, పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. NSS పీవోలు డాక్టర్ జి. సుధీర్, వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న 2026-27 కార్యక్రమాలను వివరించారు.

More in Local