← Back to news

గణేష్ నిమజ్జనంలో NCC కేడెట్ల సేవలు

By srikanth thouti· 1d ago· Narsampet (Ct), Narsampet, Warangal
గణేష్ నిమజ్జనంలో NCC కేడెట్ల సేవలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవాల్లో అశోక్ నగర్ సైనిక పాఠశాలకు చెందిన 40 మంది NCC కేడెట్లు పోలీసులకు సహకరిస్తూ సేవలందించారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా కేడెట్లు విధుల్లో పాల్గొన్నారు. క్రమశిక్షణతో బాధ్యతగా సేవలు అందించిన కేడెట్లను స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు.

More in Local