← Back to news

బూరాడలో 24 గంటలుగా విద్యుత్ కోత.. అంధకారం!

By Mohan· 18h ago· Rajam, Rajam, Vizianagaram
బూరాడలో 24 గంటలుగా విద్యుత్ కోత.. అంధకారం!

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలో 24 గంటలుగా విద్యుత్ సరఫరా లేదు. గ్రామం పూర్తిగా అంధకారంలో ఉంది. భారీ వర్షాలు, గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపోయాయని, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరెంట్ లేక మంచినీటి పంపులు పనిచేయక తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రంతా చీకట్లో గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.

More in Local