ఫ్యాక్టరీ వద్దంటూ సచివాలయం ఎదుట బైఠాయింపు

AP: NTR జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న శ్రీసాయిరామ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీకి గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం సుమారు 70శాతం పూర్తవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం గ్రామసభలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.



