← Back to news

శ్రీశైలంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం

By DK· 1d ago
శ్రీశైలంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో దేవస్థానం 11వ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశంలో 20 అంశాలను చర్చించగా 18 అంశాలకు ఆమోదం, రెండు అంశాలను వాయిదా వేశారు. అక్టోబర్ 11 నుంచి జరిగే దసరా మహోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఉత్సవాల్లో తొలిసారిగా సహస్ర చండీ సహిత మహా రుద్ర హోమం నిర్వహించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. కొలనుభారతి సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి 3.20 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

More in Local