← Back to news

MVSR ఘటన.. తండ్రి ఆవేదన

By Prashanth· 1d ago

నాదర్‌గుల్‌ <a href="https://www.theclearcutnews.com/n/bZP8Fkx">MVSR కాలేజీ దాండియా</a> ఘటనలో చని పోయిన విద్యార్థిని తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. “పండగకు ఇద్దరు కూతుళ్లను ఊరికి తీసుకెళ్దామనుకున్నా.. కానీ ఇప్పుడు పెద్ద కూతురి మృతదేహాన్ని తీసుకెళ్తున్నా. చిన్న కూతురి పరిస్థితి కూడా విషమంగా ఉంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఈవెంట్ నిర్వహించినా సరైన ఏర్పాట్లు చేయలేదని, కూతురు చనిపోయినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. కాలేజీ నిర్లక్ష్యం వల్ల తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు నాశనమైందని అన్నారు.

More in TG