← Back to news

'మాదాసి కురువ సర్టిఫికేట్లపై ఎస్సీ కమిషన్ ఆదేశాలు పాటించాలి'

By సందీప్ కుమార్· 18h ago· Makthal, Makthal, Narayanpet
'మాదాసి కురువ సర్టిఫికేట్లపై ఎస్సీ కమిషన్ ఆదేశాలు పాటించాలి'

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీసీ కురువలు తమను మాదాసి కురువలుగా ప్రకటించుకుని ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నారని దళిత ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధమని, దీనివల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నిజమైన ఎస్సీలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆయా కలెక్టరేట్లకు మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసిందని దానిని అమలు చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వోకు మెమోరాండం అందజేశారు.

More in Local