"చంద్రబాబు రక్త చరిత్ర": YS జగన్

AP: ఆంధ్రప్రదేశ్‌లో CM చంద్రబాబు అధర్మ, రక్తచరిత్ర రాస్తున్నారని YCP చీఫ్ YS జగన్ ఆరోపించారు. APలో నామినేషన్స్ వేద్దామన్నా, వేసే పరిస్థితి లేదన్న ఆయన.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందన్నారు. పెద్ద కుట్ర జరుగుతోందన్న జగన్.. రిజర్వేషన్ల ప్రకటన వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారని అన్నారు. "ప్రజల సపోర్ట్ మీకే ఉందని భావిస్తే, మరి మా అభ్యర్థుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు" అని CM చంద్రబాబును ప్రశ్నించారు జగన్.



