షాపింగ్ కాంప్లెక్స్ అలకేషన్ పై బహిరంగ ప్రకటన.. CPM డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. లాటరీ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు దుకాణాలు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయిన స్థానిక యువతతో కలిసి తహశీల్దార్, ఈఓపీఆర్డీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పశుసంవర్ధక శాఖ స్థలంలోని 29, 30 ప్లాట్లలో 55 సెంట్ల భూమిలో నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు చేశామని తెలిపారు.



