ఆష్ఠ గ్రామంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ఠ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దుర్గామాత ఆలయంలో అన్నప్రసాద వితరణ నిర్వహించగా, రాత్రి గురుస్వామి సునీల్ దత్ ఆధ్వర్యంలో మహా కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందలాది మహిళా భక్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్నదానంలో ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి స్టీల్ ప్లేట్లను వినియోగించారు. సహకరించిన గ్రామస్తులకు దుర్గామాత కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.





