కడపలో దళిత అభ్యర్థిపై దాడి!

కడప పట్టణంలోని 27వ వార్డు దళిత కార్పొరేటర్ అభ్యర్థి బి. శ్యాంసన్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. లోమడ చంద్రమోహన్ రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన వారికి పోలీసులు రక్షణ కల్పించలేదని, ఫిర్యాదు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు శ్యాంసన్ తెలిపారు.



