ఆరడుగుల మట్టి వినాయకుడు.. భక్తి పరవశంలో నిమజ్జనం!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామం రామన్న వీధి సమీపంలో మద్దాల బ్రదర్స్, మహిళా కమిటీ, యూత్ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆరడుగుల మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం మండపం వద్దే నిమజ్జనం చేపట్టారు. మహిళా భక్తులు, చిన్నారులు బిందెలతో నీటిని తీసుకొచ్చి విగ్రహంపై పోశారు. గణపతి నామస్మరణలతో ఆ ప్రాంతం భక్తి పరవశంలో మునిగిపోయింది. పర్యావరణహితంగా మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.



