సొంత నిధులతో కంప్యూటర్లు అందిస్తా: MLA

కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ కళాశాలను MLA కేఈ శ్యామ్ కుమార్ సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. కళాశాలలో విద్యా సౌకర్యాలు, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ల కొరత కారణంగా విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది MLA దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేఈ శ్యామ్ కుమార్ త్వరలో తన సొంత నిధులతో అవసరమైన కంప్యూటర్లను సమకూర్చుతానని హామీ ఇచ్చారు.



