← Back to news

జాలాల్‌పూర్‌లో పిడుగుపాటు.. 7 మేకలు మృతి

By Kamal Kumar· 1d ago· Jalalpur, Basheerabad, Vikarabad
జాలాల్‌పూర్‌లో పిడుగుపాటు.. 7 మేకలు మృతి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జెలాల్‌పూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఏడు మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు ఇసుబ్ మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడటంతో ఏడు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇసుబ్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. మృతి చెందిన మేకల విలువ సుమారు 70 వేల రూపాయల నుంచి 1 లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. పిడుగుపాటుతో నష్టపోయిన తనను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

More in Local