← Back to news

టూరిజం సీజన్ కు అరుకు రెడీ...

By B V Appalanaidu· 18h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
టూరిజం సీజన్ కు అరుకు రెడీ...

అల్లూరు సీతారామరాజులోని అరుకులోయ వచ్చే టూరిజం సీజన్ కోసం పూర్తిగా ముస్తాబయ్యింది. ఈ మేరకు అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు హోటల్ యాజమాన్యాలు, హోమ్‌స్టే నిర్వాహకులతో ప్రత్యేక మీటింగ్ జరిగింది.. పర్యాటకులకు పరిశుభ్రమైన, నాణ్యమైన సేవలు, మెరుగైన సౌకర్యాలు, ఆతిథ్యపూర్వక వాతావరణం కల్పించాలని డీఆర్‌డీఏ పీఓ జైకృష్ణ, జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు సూచించారు. అరకు కాఫీ, ఆర్గానిక్ ఉత్పత్తులు, బాంబూ చికెన్, స్థానిక మిల్లెట్ ఉత్పత్తులను పర్యాటకులకు పరిచయం చేయాలని తెలిపారు.

More in Local