APలో మరో భారీ సిమెంట్ ఫ్యాక్టరీ

AP: ఏపీలో భారీ పెట్టుబడికి మై హోం ఇండస్ట్రీస్ సిద్ధమైంది. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, గామలపాడుకి దగ్గర్లో 3000 కోట్ల రూపాయలతో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి 35 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్‌ను నిర్మిస్తారు. 2029 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించే ప్లాన్ ఉంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందన్న ప్రభుత్వం... ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది.
