← Back to news

సచివాలయ ఉద్యోగులు డిటైన్

By Krishna· 3h ago

AP: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహిస్తున్న 'ఛలో విజయవాడ' ఆందోళన తీవ్రమవుతోంది. ఐతే.. పోలీసులు ధర్నా చౌక్‌కి వెళ్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొంతమందిని ముందుగానే అదుపులోకి తీసుకొని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రెండేళ్లుగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. నిరసన తెలిపే తమ హక్కును కాలరాయాలని చూస్తే, మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

More in AP