వైజాగ్‌లో రోడ్డుపైకి జింకలు.. వీడియో
AP: వైజాగ్ లోని జూ నుంచి అర్ధరాత్రి జింకల గుంపు రోడ్డుపైకి వచ్చింది. వాటిని చూసి వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వన్య ప్రాణులు ఇలా రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదివరకు ఇలాగే రాత్రివేళ సంచరించే కొన్ని వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలు ఉన్నాయని అంటున్నారు. ఈ జింకల వీడియో SMలో వైరల్ అవుతోంది.

