రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని కమలానగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ టైమ్‌లో వెహికల్స్ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, అధికారులు అక్కడికొచ్చి వాహనాల రాకపోకలను ఆపేశారు. సమాజ్‌వాదీ పార్టీ లీడర్ నితిన్ కోహ్లీ అక్కడికి చేరుకున్నారు. నిచ్చెనతో గుంతలోకి దిగిన ఆయన.. ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనుల్లో కరప్షన్ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.



