మైనర్ డ్రైవింగ్ చేస్తే.. లైసెన్స్‌కు ‘బ్రేక్’

TG: హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. దీంతో రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల వివరాలను ‘సారథి’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసి, 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కాకుండా బ్లాక్ చేయనున్నారు. ఆధార్ నంబర్ నమోదు చేయగానే ఆ వ్యక్తి డీటెయిల్స్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్‌తోపాటు వాహన యజమానిపైనా కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తారు. ఆర్సీని ఏడాది పాటు రద్దు చేస్తారు.


