← Back to news

బస్‌స్టేషన్‌లో చోరీ.. 24 అవర్స్‌లో రికవరీ

By dk yamjala· 28 May 2026· మెదక్
బస్‌స్టేషన్‌లో చోరీ.. 24 అవర్స్‌లో రికవరీ

TG: మెదక్ జిల్లా రామాయంపేట బస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీస్‌లు 24 అవర్స్‌లో ఛేదించారు. కర్ణాటక స్టేట్‌కు చెందిన ఇద్దరు మహిళ నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేత కాలే, శిల్పా వేలును రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట సీఐ సైదా నాయక్ తెలిపారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన SI బాలరాజు, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

More in Local