జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత..!

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో 230 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. DSP పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ప్రధాన నిందితుడు శశికుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు బైకులు, ₹1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.



