స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సీతక్క

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. పెద్దాపూర్‌లో రేషన్ కార్డులు పంపిణీ అనంతరం ఆమె మాట్లాడారు. నిరుపేదల ఎన్నో ఏళ్ల కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలు రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.



