ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ

ISRO ఈ నెలాఖరులో శ్రీహరికోట నుంచి GSLV-F18 రాకెట్‌ను లాంచ్ చేసేందుకు రెఢీ అవుతుంది. ఈ రాకెట్ ద్వారా 2,232 కిలోల వెయిట్ NVS-03 నావిగేషన్ శాటిలైట్ కక్ష్యలోకి పంపనున్నారు. షార్‌లోని వాహన అనుసంధాన భవనంలో రాకెట్‌ను సిద్ధం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల పనులు కంప్లీట్ అయ్యాయి. మూడో దశ పూర్తైన తర్వాత రాకెట్‌కు NVS-03 శాటిలైట్‌కు అమర్చి లాంచ్‌కు రెఢీ చేస్తారు. ఈ ప్రయోగంతో ఇండియన్ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.



