యూపీఐ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి

యూపీఐ లావాదేవీలపై కొత్తగా Merchant Discount Rate (MDR) విధించే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఆయన మాట్లాడుతూ.. యూపీఐ సేవలు సామాన్య ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, చిన్నవ్యాపారుల రోజువారీ జీవితంలో కీలకంగా మారాయని తెలిపారు. కొత్త ఛార్జీలతో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు, స్వయంఉపాధి పొందుతున్న యువతపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు.



