← Back to news

వరద ఉధృతిని పరిశీలించిన MLA

By DK· 23h ago
వరద ఉధృతిని పరిశీలించిన MLA

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప–తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పెరిగిన వరద ప్రవాహాన్ని MLA కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న 20 గ్రామాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత కట్టలేరు వాగుపై శాశ్వత నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

More in Local