భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 75 MM వర్షపాతం నమోదైందని తహసీల్దార్ రాఘవేంద్రరావు తెలిపారు.. లోతట్టు ప్రాంతాలు, కృష్ణా పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉందని, ఫీల్డ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. అత్యవసరమైతే తప్ప రాత్రివేళ బయటకు రావద్దని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, సమస్యలపై 86395 40824కు సమాచారం ఇవ్వాలని కోరారు.



