జిల్లాలో వరద ముప్పు.. అప్రమత్తంగా ఉండాలి: SI

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆకస్మిక వరదల ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అరకులోయ SI T.మల్లేశ్వరరావు సూచించారు. ఏపీలోని ఏడు జిల్లాలకు Flash Flood Alert జారీ చేసినట్లు ఆయన తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉదయం 11.30 గంటల్లోపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్న జిల్లాల్లో అల్లూరి జిల్లా కూడా ఉందన్నారు. అరకులోయ మండలంలోని లోతట్టు ప్రాంతాలు, కొండ అంచుల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.



