క్రమశిక్షణతో ముందుకు సాగండి: కలెక్టర్

విశాఖపట్నం జిల్లా మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని వసతులు, భోజనం, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. స్టడీ అవర్‌లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్.. క్రమశిక్షణ, సమయపాలనతో పాటు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.



