← Back to news

ఘనపూర్‌లో SGT ఉపాధ్యాయుల నిరసన

By .· 18h ago· Mamidimada, Ghanpur, Wanaparthy
ఘనపూర్‌లో SGT ఉపాధ్యాయుల నిరసన

వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం మామిడిమాడలో జరుగుతున్న కాంప్లెక్స్ మీటింగ్‌లో ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని, జీవో 25ను రద్దు చేయాలని, బోధనేతర పనులు తగ్గించాలని SGT ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. FLN, రెమెడియల్ టీచింగ్ పేరుతో స్కూలు టీచర్లపై అజమాయిషీ, తనిఖీలు తగ్గించాలని కోరారు. జగిత్యాల జిల్లా చిల్వకోడూర్ హెచ్ఎం ఆత్మహత్యాయత్నానికి నిరసనగా ఈ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ చెన్నప్ప, వివిధ స్కూల్స్ HM లు పాల్గొన్నారు.

More in Local